దక్షిణాఫ్రికాలో 'చాంపియన్స్'
దుబాయి: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దక్షిణాప్రికాలో జరుగుతుందని ఐసిసి ప్రటించింది. ఐసిసి కార్యవర్గం ఈ మేరకు చేసిన సిఫార్సును ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ను గత సంవత్సరంలోనే పాకిస్తాన్ లో నిర్వహించవలసి వుంది. భద్రతాపరమైన కారణాలవల్ల వాయిదా వేసి, ఇప్పుడు వేదికను కూడా మార్చారు. దక్షిణాఫ్రికాలోని వాండరర్స్(జోహాన్స్ బర్గ్), సెంచూరియన్ పార్క్(ప్రిటోరియా)స్టేడియంలలో సెప్టెంబర్ 24 నుంచి ్క్టోబర్ 5 వరకు పోటీలు జరుగుతాయి. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని తొలుత నిర్ణయించినా వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చన్న సందేహంతో దక్షిణాఫ్రికాకు మార్చినట్టు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది.
News Posted: 16 March, 2009
|