ద్రవిడ్ క్యాచ్ ల రికార్డు
హామిల్టన్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ ల రికార్డును సమం చేశాడు. బుధవారం ఇక్కడ న్యూజిలాండ్ తే ప్రారంభమైన మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో అతడు మార్టిన్ గుప్టిల్ క్యాచ్ పట్టుకుని ఆస్ట్రేలియా ఆటగాడు మార్క్ వా క్యాచ్ ల రికార్డు(181)ను చేరుకున్నాడు. ద్రావిడ్ కు ఇది 132వ టెస్ట్. ఇది 2002లో టెస్ట్ క్రికెట్ రంగం నుండి రిటైరైన మార్క్ వా కంటె నాలుగు మ్యాచ్ లు ఎక్కువ. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఔటయిన మొదటి బ్యాట్స్ మన్ గుప్టిల్. ఆ తరువాత మార్క్ వా రికార్డును అధిగమించే అవకాశాన్ని ద్రావిడ్ చేజార్చుకున్నాడు. కివీస్ కెప్టెన్ వెట్టోరి(118)స్కోరు 77 వద్ద ఉండగా, హర్భజన్ సింగ్ వేసిన బంతిని స్లిప్ ఫీల్డర్ల మీదుగా కొట్టాడు. ద్రవిడ్ బంతిని అందుకోవడంలో క్షణం ఆలస్యమయింది.
News Posted: 18 March, 2009
|