'మోడీ మోసగాడు'
జైపూర్: కనక వర్షం కురిపించే ఐపిఎల్ టోర్నమెంట్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం తమ రాష్ట్రానికి దక్కకుండా చేసిన లలిత్ మోడీ నయవంచకుడని రాజస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఐపిఎల్ ట్వంటీ టోర్నమెంట్ కు ఎదురవుతున్న అవరోధాలు ఒక్కొక్కదాన్ని అధిగమిచడంలో నిమగ్నమై వున్న లలిత్ మోడీపై రాజస్థాన్ ప్రభుత్వ ప్రకటన యుద్ధభేరి మోగించింది. అటువంటి ఆరోపణలన్నిటినీ 'చెత్త'గా కొట్టిపారేసిన మోడీ రాజస్థాన్ ప్రభుత్వ ఆరోపణను నిరాధారం, అసత్యం అని అభివర్ణించారు.
ఐపిెల్ రెండో సీజన్ కు సవరించిన షెడ్యూల్ ను మోడీ తమకు పంపించలేదని, మ్యాచ్ ల నిర్వహణకు తాము ఇంకా ఏర్పాట్లు కొనసాగిస్తూనే ఉన్నామని రాజస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది. మోడీ ప్రోద్బలం తోనే ఐపిఎల్ పోటీలను రాజస్థాన్ నుండి తరలించారని రాజస్థాన్ హోం మంత్రి శాంతి ధరీవాల్ ఆరోపిస్తూ 'రాజస్థాన్ ప్రజలు మోసపోయార'న్నారు.
News Posted: 19 March, 2009
|