సోనీతో ఐపిఎల్ రాజీ
ముంబాయి: ఐపిఎల్ రెండో సీజన్ పోటీలను సోనీ టెలివిజన్ ప్రసారం చేస్తుంది. ఐపిఎల్ 2009 ప్రసార హక్కులకు సంబంధించి తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) మల్టీ స్క్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్(పూర్వపు సోనీ ఎంటర్ టైన్ మంట్ టెలివిజన్)తో ఒప్పందం కుదుర్చుకుంది. 1.026 బిలియన్ల అమెరికన్ డాలర్లకు ఈ ఒప్పందం కుదిరినట్టు సమాచారం. బిసిసిఐకి సోనీ కొత్త ఆఫర్ ప్రతిపాదించి, కోర్టు వెలుపల వివాదం పరిష్కారానికి అంగీకరించాలని కోరింది.
News Posted: 19 March, 2009
|