ఐపిఎల్ కు పచ్చజెండా?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ నిర్వాహకులు ఆశించిన రీతిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీల నిర్వహణకు వివిధ రాష్ట్రాల నుండి రావలసిన అనుమతి పత్రాలు హోం శాఖకు, నిర్వాహకులకు అందాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీలకు కూడా భద్రతా ఏర్పాట్లు కల్పించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. కేవలం మహారాష్ట్ర మాత్రమే షరతుల కూడిన అనుమతి ఇచ్చింది. ఎన్నికల పోలింగు తేదీలనాడు తప్పితే మిగిలిన రోజుల్లో జరిగే పోటీలకు భద్రత కల్పించడానికి ముంబాయి పోలీసు కమిషనర్ హసన్ గఫూర్ సంసిద్ధత వ్యక్తం చేశరు. పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు ఫైవ్ స్టార్ హోటళ్లలో కాకుండా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో బస చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఐపిఎల్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ విభాగాలనుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలు పూర్తయ్యాకే ఐపిెల్ పోటీలు నిర్వహించాలని పోలీసు డైరక్టర్ జనరల్(ఎన్నికలు)సుప్రకాష్ చక్రవర్తి చెప్పారు. రాష్ట్రంలో మూడు దఫాలుగా జరగనున్న ఎన్నికలు పూర్తయ్యాక, మే నెలలో ఐపిఎల్ పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు.
News Posted: 21 March, 2009
|