'రైడర్స్'కు కీలకం సౌరవ్
కోలకత: సౌరవ్ గంగూలి ఉదంతంపై వ్యక్తమైన నిరసనలకు స్పందిస్తూ 'సౌరవ్ కోలకత నైట్ రైడర్స్ జట్టులో కీలకమైన వ్యక్తి' అని షారూక్ గురువారంనాడు అభివర్ణించారు. దాదాను సంప్రదించకుండా, ఆయనకు తెలియకుండా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కింగ్ ఖాన్ స్పష్టం చేశారు. కెకెఆర్ దాదాను గౌరవిస్తుంది, ప్రేమిస్తుందని, ఇకమీదట ఈ విషయంపై ఎవరు కూడా అతిగా ప్రతిస్పందించాల్సిన అవసరముండదని ఖాన్ తెలిపారు.
బహుళ కేప్టన్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలని గత ఏడాది నుండి మేము యోచిస్తున్నాము. ట్వంటీ ట్వంటీ మాచ్ లు కొత్త తరహావి కాబట్టి కొత్త పద్దతులను మేము ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని ఖాన్ స్పష్టం చేశారు. 'జాన్ బుక్నాన్ ను గ్రెగ్ ఛాపెల్ తో సరిపోల్చడం సరికాదు. దాదా అంటే మాకు చాలా ఇష్టం. దాదా నుండి కేప్టెన్సీని ఎవరూ లాక్కోవడం లేదు లేదా ఆయన్ని టీమ్ కు దూరం చేయడం లేదు. జాన్, సౌరవ్ లిద్దరూ మా ముఖ్యమే. వారితో సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలను తీసుకుంటాము ' అని షారూక్ స్పష్టం చేశారు.
News Posted: 26 March, 2009
|