నేపియర్ టెస్ట్ డ్రా
నేపియర్: భారత-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో భారతజట్టు 1-0తో ఆధిక్యతలో ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ చేసిన భారతజట్టు రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 476 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్(137) చివరి వరకూ పోరాడి తన కెరీర్ లో ఐదో టెస్ట్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. రెండో వికెట్ కు ద్రవిడ్ తో కలసి 133 పరుగులు, మూడో వికెట్ కు టెండుల్కర్ తో కలసు 97 పరుగులు, నాలుగో వికెట్ కు లక్ష్మణ్ తో కలసి 96 పరుగులు చేసిన గంభీర్ మొత్తం 642 నిముషాల సేపు క్రీజులో ఉన్నాడు. స్టైలిష్ బ్యాట్స్ మన్ వివిఎస్ లక్ష్మణ్(120 నాటౌట్) తన కెరీర్ లో 14వ సెంచరీ నమోదు చేశాడు. యువరాజ్ సింగ్ 54 పరుగులతో నాటౌట్ గా వున్నాడు.
స్కోర్లు: న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్-619/9 డిక్లేర్డ్. ఇండియా మొదటి ఇన్నింగ్స్-305, రెండో ఇన్నింగ్స్-476/4.
News Posted: 30 March, 2009
|