ధోనికి ఫిట్ నెస్ టెస్ట్
నేపియర్: నడుము నొప్పి కారణంగా న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆడలేకపోయిన భారతజట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బుధవారం ఫిట్ నెస్ టెస్ట్ జరుగుతుంది. వెల్లింగ్టన్ లో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ లో ధోని అడేద్, లేనిది ఈ వైద్య పరీక్షలో తేలిపోతుంది. ఇక్కడ సోమవారంతో ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భరతజట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యం వహించాడు. శుక్రవారం ప్రారంభమయ్యే మూడో టెస్ట్ లో ధోని అడేదీ లేనిది తనకు తెలియదని, బుధవారం అతడికి వైద్య పరీక్ష జరుగుతుందని సెహ్వాగ్ చెప్పాడు. రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ప్రాక్టీసు చేసిన ధోని, ఆ తరువాత గాయం కారణంగా జట్టునుంచి వైదొలిగాడు. మ్యాచ్ మొదలైన రోజు, టాస్ కు కొద్ది గంటలముందు సెహ్వాగ్ కు కెప్టెన్సీ గురించి చెప్పారు. సెహ్వాగ్ టాస్ కు వెళ్లినప్పుడు ధోని బ్లేజర్ ను ధరించాడు.
News Posted: 30 March, 2009
|