రైడర్స్ జట్టు ప్రకటన అక్కడే
కోల్ కటా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో ఆడే కోల్ కటా నైట్ రైడర్స్(కెకెఆర్) జట్టును, కెప్టెన్ ను దక్షిణాఫ్రికాలో ప్రకటిస్తామని, ఇక్కడ కాదని తెలిపారు. జట్టు కెప్టెన్ గా సౌరవ్ గంగూలీని తప్పించినందుకు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని భయపడిన జట్టు యాజమాన్యం సోమవారం ఈ విషయం వెల్లడించింది. జట్టు పాల్గొన్న ఆరు రోజుల ట్రెయినింగ్ క్యాంప్ ముగియడంతో కెకెఆర్ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టరం జాన్ బుకానన్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం నుండి వెళ్లిపోతూ 24 మంది ఆటగాళ్ల జట్టు మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్తుందని మాత్రం చెప్పాడు. జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోయ్ భట్టాచార్యను జట్టు వివరాలు కోరగా దక్షిణాఫ్రికా ఎవరు వెళ్లేది ఇప్పుడే వెల్లడించదలచుకో లేదని, జట్టును, కెప్టెన్ ను దక్షిణాఫ్రికాలోనే ప్రకటిస్తామని చెప్పారు.
News Posted: 30 March, 2009
|