'దాదా లేకుంటే కెకెఆర్ లేదు'
ముంబాయి: 'దాదా లేకుండా కోల్ కటా నైట్ రైడర్స్(కెకెఆర్) జట్టే ఉండదు' అన్నాడు జట్టు యజమాని, బాలివుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. కోచ్ జాన్ బుకానన్, సౌరవ్ గంగూలీని పక్కకు తప్పించేస్తున్నాడన్న ఊహాగానాలను షారుఖ్ కొట్టిపారేశాడు. ఒకరి కంటె ఎక్కువమంది కెప్టెన్లు ఉండాలన్న జట్టు నిర్ణయం ఉద్దేశం స్టార్ ఆటగాడు గంగూలీని పక్కకు తప్పించడం ఎంతమాత్రం కాదని షారుఖ్ స్పష్టం చేశాడు. కెప్టెన్ స్థానాన్ని బ్రెండన్ మెకల్లమ్(న్యూజిలాండ్), క్రిస్ గేల్(వెస్టిండీస్), లక్ష్మీ రతన్ శుక్లా లతో రొటేషన్ పద్ధతిలో గంగూలీ పంచుకోవలసి ఉంటుందని కోచ్ బుకానన్ ఆలోచన.
'ఇది కేవలం ప్రయోగం మాత్రమే. గంగూలీ లేకపోతే కెకెఆర్ కు మనుగడ ఉండదు' అని షారుఖ్ ఖాన్ చెప్పాడు. తాము ఒక జట్టుగా వ్యవహరిస్తామని, ఎవరికి వారు నిర్ణయాలు తీసుకునే వీలు లేదని ట్వంటీ 20 కొత్తరకం ఆట కాబట్టి కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉంటాయని వివరించాడు. ఒక మ్యాచ్ కి నలుగురు కెప్టెన్లు ఉండరనీ, ఒక మ్యాచ్ కి ఒక్కడే కెప్టెన్ ఉంటాడని స్పష్టం చేశాడు. ఐపిఎల్ రెండో సీజన్ ఏప్రిల్ 18 దక్షిణాఫ్రికాలో ప్రారంభమవుతుంది.
News Posted: 31 March, 2009
|