ధోనీ సేనకు బోనస్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పై చరిత్రాత్మకమైన టెస్ట్, వన్డే సిరీస్ విజయాలు సాధించిన భారత క్రికెట్ జట్టు సభ్యు ఒకొక్కరికి 15 లక్షల రూపాయల వంతున బోనస్ ను బిసిసిఐ ప్రకటించింది. వెల్లింగ్టన్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇండియాకు 1-0తో సిరీస్ విజయం లభించింది. ధోనీ సేన ఇంతకుముందే వన్డే సిరీస్ ను(న్యూజిలాండ్ లో మొదటిసారి) 3-1తో గెలుచుకుంది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మోహన్ జట్టు అభినందిస్తూ టెస్ట్ లు, వన్డే జట్ల సభ్యులందరికీ బోనస్ ను ప్రకటించారు. కోచ్, మేనేజర్ తదితర జట్టు సిబ్బందికి 10 లక్షల రూపాయల చొప్పున బోనస్ ను ప్రకటించారు.
News Posted: 7 April, 2009
|