నేను ఓపెనర్ కాను:సెహ్వాగ్
న్యూఢిల్లీ: అవకాశం ఇస్తే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తానని భారతజట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మన్ వీరేందర్ సెహ్వాగ్ చెప్పాడు. 'నేనెప్పుడూ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ నే. నాకు అక్కడ బ్యాటింగ్ చెయ్యడమే ఇష్టం. ప్రస్తుతం ఓపెనర్ గా వెళ్లమని జట్టు డిమాండ్ చేస్తోంది తాబట్టి అలాగే ఆడుతున్నాను' అని గంభీర్-సెహ్వాగ్ జట్ల మధ్య ఐదు ఓవర్ల ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సెహ్వాగ్ చెప్పాడు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేస్తానన్న తన విజ్ఞప్తిని జట్టు మేనేజిమెంట్ తిరస్కరించిందన్నాడు. అయితే ఓపెనర్ గా సెహ్వాగ్ సరాసరి 51.21 పరుగులు కాగా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా 41.55 పరుగులే అన్నది గమనించవలసిన విషయం.
గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఓపెనరే అని, ఫస్ట్ క్లాస్ మ్యా్ లలో తానెప్పుడూ ఓపెనర్ గా దిగలేదని సెహ్వాగ్ చెప్పాడు. ఇదిలా ఉండగా ఐపిఎల్ పోటీల్లో తమ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు విజయావకాశాలలో బౌలర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని గౌతమ్ గంభీర్ చెప్పాడు. 'ట్వంటీ20 పోటీల్లో బౌలింగ్ ఉత్తమంగా ఉండాలని నా ఉద్దేశం. మా జట్టులో డేనియల్ వెట్టోరి, గ్లెన్ మెక్ గ్రాత్, ఆశిష్ నెహ్రా, అమిత్ మిశ్రా, మహారూఫ్ వంటి మంచి బౌలర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికాలో వాతావరణం, పిచ్ లు వీల్లకి బాగా ఉపకరిస్తాయి. ప్రత్యర్దులకు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగితే ఈసారి ఐపిఎల్ ట్రోఫీ మాదే' అన్నాడు గంభీర్.
News Posted: 13 April, 2009
|