ఐసిఎల్ కు ఐసిసి 'నో'!
దుబాయ్: ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసిఎల్)ను 'అనధికార క్రికెట్'గా గుర్తింపు కోరుతూ భారత తిరుగుబాటు గ్రూప్ పెట్టుకున్న దరఖాస్తును అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తిరస్కరించింది. ఐసిఎల్ దరఖాస్తును ఐసిసి బోర్డు పరిశీలించిందని, నిబధనలకు లోబడి, 'అనధికార' గుర్తింపును ఇవ్వడానికి అవసరమైన అర్హతలులేనందున ఐసిఎల్ దరఖాస్తును తిరస్కరించారని ఎగ్జిక్యూటివ్ బోర్డు రెండు రోజుల సమావేశాల అనంతరం ఐసిసి ఒక ప్రకటనలో తెలియజేసింది. తనకు గుర్తింపు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లనున్నట్టు ఐసిఎల్ బెదిరించింది. ఐసిఎల్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఆటగాళ్ల భవిష్యత్తును వారి వారి దేశాల క్రికెట్ బోర్డుల నిర్ణయానికి వదిలిపెడుతున్నట్టు ప్రకటనలో తెలిపారు.
News Posted: 19 April, 2009
|