డక్కన్ జట్టుకు భారీవిజయం
కేప్ టౌన్: ఐపిఎల్ రెండో సీజన్ రెండో రోజు రెండో మ్యాచ్ లో డక్కన్ ఛార్జర్స్ జట్టు కోల్కటా నైట్ రైడర్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ కాగా, ఛార్జర్స్ ఆ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 104 పరుగులతో, ఛేదించింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా దిగిన కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. క్రిస్ గేల్ 10, గంగూలీ 1, బ్రాడ్ హాడ్జ్ 31, చోప్రా 11, శుక్లా 8, అగార్కర్ 7, కార్తిక్ 10, ఇషాంత్ 9, దిండా 2 పరుగులు చేశారు.
మీడియం పేసర్ ఆర్పీ సింగ్ 3.4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా హర్మీత్ 1(23), ఓఝా 2(14), స్కాట్ స్టైరిస్ 2(32) వికెట్లు తీసుకున్నారు. ఆర్పీ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఛార్జర్స్ జట్టులో గిల్ క్రిస్ట్ 13, హెర్షలీ గిబ్స్(నాటౌట్)43, వివిఎస్ లక్ష్మణ్(రనౌట్)10, రోహిత్(నాటౌట్)36 పరుగులు సాధించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో దిండా మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు.
News Posted: 19 April, 2009
|