కింగ్స్ 'సూపర్' విజయం!
పోర్ట్ ఎలిజబెత్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ తన ఖాతాలో తొలి విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోటీలో బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టును 92 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుతబ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా,రాయల్ ఛాలెంజర్స్ 15.2 ఓవర్లలో 87 పగుగులకే ఆలౌట్ అయింది. రాబిన్ ఉతప్ప, జాక్స్ కలిస్ మినహా ఎవరూ పెద్దగా స్కోర్లు సాధించలేకపోయారు. రాహుల్ ద్రవిడం మరోసారి జట్టును ఆదుకోడానికి ప్రయత్నించినా, రెండో వైపు నిలకడగా ఆడేవారు లేకపోయారు. చెన్నై జట్టులో ముత్తయ్య మురళీథరన్ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్సులో పార్థివ్ పటేల్ 30, మాథ్యూ హేడెన్ 65, సురేష్ రైనా 28, ధోని 16, ఫ్లింటాఫ్(నాటౌట్)22, అల్బీ మోర్కెల్ 5 పరుగులు చేశారు. బెంగుళూరు జట్టులో రాబిన్ ఉతప్ప 20, జాక్స్ కలిస్ 2 ద్రవిడ్ 20, విరాట్ కొహ్లి 11, వినయ్ కుమార్ 5, కుంబ్లె 1 పరుగులు చేయగా మిగిలిన వారందరూ డకౌట్ అయ్యారు. చెన్నై బౌలర్లలో మన్ ప్రీత్ గోని 1, బాలాజీ 2, మోర్కెల్ 1, ఫ్లింటాఫ్ 1, జోగిందర్ శర్మ 1 వికెట్లు పడగొట్టారు. మురళీథరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
News Posted: 20 April, 2009
|