నైట్ రైడర్స్ విజయం
డర్బాన్: ఐపిఎల్ రెండో సీజన్ పోటీల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు మరోసారి వర్షం దెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో కోల్కటా నైట్ రైడర్స్ డక్ వర్త్-లూయీస్ రూల్ ను అనుసరించి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగవలసిన రెండో మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయింది. రెండు జట్లకూ ఒక్కొక్క పాయింట్ లభించాయి.
మొదటి మ్యాచ్ లో, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ తరువాత నైట్ రైడర్స్ స్కోరు 9.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 79 పరుగుల వద్ద వర్షం ప్రారంభమయింది. నిర్ణీత సమయం ముగిసేవరకు వర్షం తగ్గకపోవడంతో డక్ వర్త్-లూయీస్ నిబంధనను అమలు పరిచారు. దాని ప్రకారం, అప్పటికి నైట్ రైడర్స్ 11పరుగుల ఆధిక్యంలో వుంది. 26 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 44(నాటౌట్)పరుగులు చేసిన రైడర్స్ ఆటగాడు క్రిస్ గేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
పంజాబ్ జట్టులో బొపార 15, గోయెల్ 0, ఇర్ఫాన్ పఠాన్ 32, సంగక్కర 26(రనౌట్), యువరాజ్ సింగ్ 38, జయవర్దన(నాటౌట్) 31, కొహ్లి 1, పియూష్ చావ్లా 3 పరుగులు చేయగా, రైడర్స్ బౌలర్లు సౌరవ్ గంగూలీ 2, ఇషాంత్ శర్మ, అశోక్ దిండా, మోజెస్ హెన్రిక్స్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. రైడర్స్ జట్టులో మెకల్లమ్(కాట్ సంగక్కర-బౌల్డ్ విఎస్ మాలిక్) 21, క్రిస్ గేల్(నాటౌట్) 44, బ్రాడ్ హాడ్జ్(నాటౌట్)10 పరుగులు చేశారు.
News Posted: 21 April, 2009
|