ఛాలెంజర్స్ పై 'గిల్లీ'ఛార్జ్!
కేప్ టౌన్: ఐపిఎల్ రెండో సీజన్ లో డక్కన్ ఛార్జర్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ను 24 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేయగలిగింది. ఈ జట్టులో రాహుల్ ద్రవిడ్(48), విరాట్ కొహ్లి(50) మినహా ఎవరూ గణనీయమైన స్కోరు సాధించలేకపోయారు. థార్జర్స్ బౌలర్లలో స్కాట్ స్టైరిస్ 3, ఆర్పీ సింగ్ 2, ఫైడల్ ఎడ్వర్డ్స్, ప్రగ్యన్ ఓఝా చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఢక్కన్ ఛార్జర్స్ ఇన్నింగ్సులో ఆడమ్ గిల్ క్రిస్ట్(71), రోహిత్ శర్మ (52-30 బంతులు, 1 సిక్సర్, 5 ఫోర్లు) మాత్రమే భారీ స్కోర్లు చేయగా మిగిలినవారు నామమాత్రంగా ఆడారు. కెప్టెన్ గిల్ క్రిస్ట్ 45 బంతుల్లో 6 బౌండరీలు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఛాలెంజర్స్ బౌలర్లలో కెప్టెన్ పీటర్సన్ 2, జెస్సీ రైడర్, ప్రవీణ్ కుమార్, డేల్ స్టీన్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
News Posted: 22 April, 2009
|