ఇది 'డివిల్స్' విజయం!
డర్బాన్: ఐపిఎల్ రెండో సీజన్ లో ఉత్కంఠభరితంగా జరిగిన మొదటి మ్యాచ్ ఇదే! భారీ స్కోర్లు నమోదైన ఈ పోటీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జటటు చెన్నై సూపర్ కింగ్స్ ను 9 పరుగుల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్(105 నాటౌట్) తొలి అర్ధ సెంచరీ 35 బంతుల్లో పూర్తి చేసిన డివిలియర్స్ ఆ తరువాత మరింతగా విజృంభించి 16 బంతుల్లోనే రెండో అర్ధ సెంచరీ పూర్తి చేయడం విశేషం. పరిమిత ఓవర్ల పోటీల్లో నెంబర్ వన్ జంటగా పేరు తెచ్చుకున్న గౌతమ్ గంభీర్(0), వీరేందర్ సెహ్వాగ్(6) ఈ మ్యాచ్ లో ఏ మాత్రం రాణించలేకపోయారు. గంభీర్ మ్యాచ్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేశాడు.
మురళీ కార్తిక్ 18, తివారి 9 పరుగులు చేయడంతో డెవిల్స్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది. చెన్నై జట్టు బౌలర్లలో లక్ష్మీపతి బాలాజీ 3 వికెట్లు, గోనీ, మోర్కెల్ చెరో వికెట్ పడగొట్టారు. 190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ జట్టులో ఓపెనర్ మాథ్యూ హేడెన్ తనదైన శైలిలో ాడి 27 బంతుల్లో 57 పరుగులు చేయగా, రెండో ఓపెనర్ పార్థివ్ పటేల్ 16 పరుగులకే ఔటయ్యాడు. సురేష్ రైనా 41, కెప్టెన్ ధోని 5, ఫ్లింటాఫ్ 16, మోర్కెల్(నాటౌట్)13, బద్రినాథ్ 7, గోనీ 6, జోగీందర్ శర్మ 4 పరుగులు చేయగా, మురళీథరన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా మిగిలాడు. ఇరవై ఓవర్లు ముగిసే సరికి కింగ్స్ జట్టు 180 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో సంగ్వాన్ 3, వెట్టోరి 2, నెహ్రా 1 వికెట్లు పడగొట్టారు. ముగ్గురు బ్యాట్స్ మెన్ రనౌట్ అయ్యారు. డివిలియర్స్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
News Posted: 23 April, 2009
|