మోడీకి హై కోర్టు నోటీసు
జైపూర్: సంబంధిత అధికారుల అనుమతి లేకుండా భారతదేశం విడిచి వెళ్లినందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమిషనర్ లలిత్ మోడీకి జైపూర్ హై కోర్టు నోటీసు జారీ చేసింది. గత సంవత్సరం మే 13న సంభవించిన జైపూర్ బాంబు పేలుళ్లలో బాధితులకు మోడీ హామీ ఇచ్చిన నష్ట పరిహారం పంపిణీలో అక్రమాలు జరిగినట్టు నాగరిక్ మోర్చా అనే ఎన్జీఓ సంస్థ ఐపిసి 420 సెక్షన్ కింద కేసు దాఖలు చేసింది. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసిన మోడీకి, ముందుగా అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న షరతుపై కోర్టు బెయిల్ మండజూరు చేసింది. అయితే మోడీ కోర్టు షరతును విస్మరించి, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐపిఎల్ రెండో సీజన్ పోటీలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో జైపూర్ హైకోర్టు మోడీకి శుక్రవారం నోటీసు జారీ చేసింది.
News Posted: 24 April, 2009
|