యువీ కింగ్స్ తొలి విజయం
డర్బన్: ఐపిఎల్ రెండో సీజన్ లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తొలి విజయాన్ని చవిచూసింది. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చెసిన బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించగా, పంజాబ్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 59 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగులు చేసిన కింగ్స్ బ్యాట్స్ మన్ రవి బోపరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
రాయల్ ఛాలెంజర్స్ జట్టులో జెస్సీ రైడర్ 32, జాక్స్ కాలిస్ 62, ద్రవిడ్ 10, రాస్ టేలర్ 35, విరాట్ కొహ్లి 2, ప్రవీణ్ కుమార్ 13 వినయ్(నాటౌట్)1, కుంబ్లె(నాటౌట్) 5 పరుగులు సాధించగా, రాబిన్ ఉతప్ప, కెవిన్ పీటర్సన్, పంకజ్ డకౌట్ అయ్యారు. కింగ్స్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3, అబ్దుల్లా 4, చావ్లా, విఆర్వీ సింగ్ ఒకొక్కటి వికెట్లు పడగొట్టారు.
పంజాబ్ జట్టు ఇన్నింగ్సులో గోయెల్(రనౌట్)19, సంగక్కర 26, యువరాజ్ సింగ్(నాటౌట్)30, జయవర్దన(నాటౌట్)1 పరుగులు చేయగా, బెంగుళూరు జట్టు బౌలర్లలో కాలిస్, కుంబ్లె చెరో వికెట్ తీసుకున్నారు.
News Posted: 24 April, 2009
|