దూసుకుపోతున్న 'డెవిల్స్'
పోర్ట్ ఎలిజబెత్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో చిత్తుగా ఓడిపాయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 150 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండ సిక్సర్లతో 67(నాటౌట్)పరుగులు చేసి ఢిల్లీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెగుళూరు రాయల్స్ జట్టు ఇంన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ నాన్స్ వికెట్ కోల్పోయింది. రెండో ోపెనర్ రాబిన్ ఉతప్ప 3 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కెప్టెన్ కెవిన్ పీటర్సన్, రాస్ టేలర్ మూడో వికెట్ కు 62 పరుగులు జతచేశాక, 25 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేసిన పీటర్సన్, డేనియల్ వెట్టోరి బంతికి బౌల్డ్ అయ్యాడు. 34 బంతుల్లో మూడు ఫోర్లతో 31 పరుగులు చేసిన రాస్ టేలర్ ఆ తరువాత ఔటయ్యాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మార్క్ బౌచర్(36-28 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కొహ్లి(22-24 బంతులు) ఐదో వికెట్ కు 61 పరుగులుజోడించారు. వినయ్ కుమార్ పరుగులేమీ చేయకుండా రనౌట్ కాగా, అఖిల్ 8, పంకజ్ సింగ్ 1 పరుగులతో నాటౌట్ గా మిగిలారు.
ఢిల్లీ బౌలర్లలో ఆశిష్ నెహ్రా 2, నాన్స్ , సంగ్వాన్, మిశ్రా, వెట్టోరి ఒక్కొక్కటి వికెట్లు తీసుకకున్నారు. డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ సెహ్వాగ్ మరోసారి తక్కువ(7)పరుగులకు ఔటయ్యాడు. రెండో ఓపెనర్ గంభీర్ 16, డివిలియర్స్ 21, కార్తిక్ 12, మిథున్ మన్హాస్(నాటౌట్) 23 పరుగులు చేశారు. బెగుళూరు బౌలర్లలో పంకజ్ సింగ్ 2, అప్పన్న, అఖిల్ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. తిలకరత్నె దిల్షాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
News Posted: 26 April, 2009
|