రాయల్స్ పై కింగ్స్ గెలుపు
కేప్ టౌన్: ఐపిఎల్ టోర్నమెంట్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు రెండో విజయం లభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ను 27 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేయగా, రాజస్థాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(39 పరుగులు, 2 వికెట్లు)కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ బొపారా 11, గోయెల్(రనౌట్)0, సంగక్కర(రనౌట్)60, యువరాజ్ సింగ్ 2, జయవర్దన 7, చావ్లా(నాటౌట్)6, మోటా(నాటౌట్) 1 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో కమ్రాన్ 2, మునాఫ్ పటేల్ 2, వికెట్లు పడగొట్టారు.
రాజస్థాన్ జట్టులో అస్నోద్కర్ 3, గ్రీమ్ స్మిత్ 2, క్వీనీ 7, యూసుఫ్ పఠాన్ 10, మస్కరెనాస్ 4, జడేజా 37, రౌత్ 1, వార్న్(నాటౌట్)34, రావత్(నాటౌట్)4 పరుగులు చేయగా, పంజాబ్ బౌలర్లలో అబ్దుల్లా 3, ఇర్ఫాన్ 2, చావ్లా 2 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
News Posted: 26 April, 2009
|