ఛార్జర్స్ కు మరో విజయం
డర్బన్: ఐపిఎల్ రెండో సీజన్ లో డక్కన్ ఛార్జర్స్ జట్టు అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. సోమవారం కింగ్స్ మీడ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన చెన్నై జట్టు 20 ోవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించగా, డక్కన్ ఛార్జర్స్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కేవలం 19 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 44 పరుగులు చేయగా, హెర్షలీ గిబ్స్(నాటౌట్-మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్) 56 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. మిగిలి బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ 4, రోహిత్ శర్మ 18, డానే స్మిత్ 12, బిలాఖియా(నాటౌట్)12 పరుగులు చేశారు.
చెన్నై బౌలర్లలో సురేష్ రైనా 2, బాలాజీ, ముత్తయ్య మురళీథరన్ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో మాథ్యూ హేడెన్ అర్ధ సెంచరీకి ఒక్క పరుగు తక్కువగా ఔటయ్యాడు. రెండో ఓపెనర్ పార్థివ్ పటేల్ డకౌట్ కాగా, సురేష్ రైనా 25, ధోని 22, జాకబ్ ఓరమ్(నాటౌట్)41, అల్బీ మోర్కెల్ 13, బద్రినాథ్ 8, గోనీ(నాటౌట్)0 పరుగులు చేశారు. డక్కన్ ఛార్జర్స్ బౌలర్లలో ప్రగ్యన్ ఓఝా 2, ఫైడల్ ఎడ్వర్డ్స్, ఆర్పీ సింగ్, వేయముగోపాలరావు, రోహిత్ శర్మ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు.
News Posted: 27 April, 2009
|