వరల్డ్ కప్ ఫైనల్ ఇండియాలో
ముంబాయి: 2011 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో, ఫైనల్ పోటీతో సహా, 29 మ్యాచ్ లు ఇండియాలో జరుగుతాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లార్గట్ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. శ్రీలంకలో 12, బంగ్లాదేశ్ లో 8 మ్యాచ్ లు జరుగుతాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ను క్రికెట్ ప్రపంచం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. 2011 వరల్డ్ కప్ క్రికెట్ ప్రారంభోత్సవం ఆ యేడాది ఫిబ్రవరి 18న, తొలి మ్యాచ్ 19న జరుగుతాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు రెండు బంగ్లాదేశ్ లోను, ఇండియా, శ్రీలంక లలో ఒక్కొక్కటి జరుగుతాయి. అలాగే సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఇండియా, శ్రీలంక లలో జరుగుతాయి. ఇంతవరకూ పాకిస్తాన్ లో వున్న టోర్నమెంట్ సెక్రటేరియట్ ను ముంబాయికి మార్చారు.
News Posted: 28 April, 2009
|