డెవిల్స్ పరాజయం
సెంచూరియన్: ఐపిఎల్ రెండో సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయపరంపరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్రేక్ వేసింది. అత్యంత విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా పేరు పొందిన ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్ ఇంతవరకూ ఐపిఎల్ రెండో సీజన్ లో అంతగా రాణించకపోయినా అదృష్టంతో ఇంతకు ముందువరకూ ఆడిన మ్యాచ్ లలో గెలిచిన ఢిల్లీ జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ మంచి గుణపాఠం నేర్పింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగా, రాయల్స్(147) ఆ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి, దాటగలిగింది. గంభీర్(8), సెహ్వాగ్(16) ఎప్పటిలాగే త్వరగా పెవిలియన్ చేరుకోవడంతో, ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. డివిలియర్స్ అర్ధ సెంచరీతో జట్టు పరువు కాపాడాడు. దినేష్ కార్తిక్ 4, వెట్టోరి 29, మనాస్(నాటౌట్) 23, మిశ్రా 0, సంగ్వాన్(నాటౌట్) 1 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో మస్కరెనాస్ 2, మునాఫ్ 2, షేన్ వార్న్ 2, కమ్రాన్ 1 వికెట్లు పడగొట్టారు.
రాజస్థాన్ బ్యాట్స్ మెన్ లో యూసుఫ్ పఠాన్(నాటౌట్) 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. క్వీనీ 4, గ్రీమ్ స్మిత్(నాటౌట్) 44, అస్నోద్కర్(రనౌట్) 11, వల్థాటి 1, జడేజా 16 పరుగులు చేయగా వార్న్ డకౌట్ ్య్యాడు. ఢిల్లీ బౌలర్లలో మిశ్రా 3, నెహ్రా 1 వికెట్లు పడగొట్టారు.
News Posted: 28 April, 2009
|