నైట్ రైడర్స్ మరో ఓటమి
డర్బన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ లో కోల్కటా నైట్ రైడర్స్(కెకెఆర్) జట్టు మరో మ్యాచ్ ఓడిపోయింది. బుధవారం జరిగిన పోటీలో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కటా జట్టును 6 వికెట్లనష్టానికి 139 పరుగులకు పరిమితం చేసి, 19.5 ఓవర్లలో 143 పరుగులతో విజయాన్ని కైవసం చేసుకుంది. కోల్కటా జట్టులో కెప్టెన్ మెకల్లమ్ డకౌట్ అయ్యాడు. క్రిస్ గేల్ 37 బంతుల్లో 6 ఫోర్లతో 40, వాన్ విక్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 43 పరుగులు చేశారు. బ్రాడ్ హాడ్జ్ 17,సౌరవ్ గంగూలీ 1, సాహా 21, శుక్లా 2, అజిత్ అగార్కర్ 6 పరుగులు చేశారు.
రాయల్స్ ఛాలెంజర్స్ బౌలర్లలో అనిల్ కుంబ్లె 2, పీటర్సన్, వాన్ డెర్ మెర్వ్, ప్రవీణ్, అప్పన్న ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగుకు దిగిన బెంగుళూరు జట్టులో జాక్స్ కాలిస్ 23, గోస్వామి 43, పీటర్సన్ 13, కొహ్లి 19, మార్క్ బౌచర్ 25, డెర్ మెర్వ్ 9, పాండే 2 పరుగులు సాధించారు. కోల్కటా జట్టు బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, హాడ్జ్ 3 వికెట్లు పడగొట్టారు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 23 పరుగులు సాధించిన మార్క్ బౌచర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
News Posted: 29 April, 2009
|