పంజాబ్ కింగ్స్ గెలుపు
డర్బన్: ఐపిఎల్ రెండో సీజన్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ బౌలర్లు తమ జట్టుకు ఘన విజయాన్ని సాధించిపెట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి, తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో ఏడుగురు బ్యాట్స్ మెన్ ను 116 పరుగులకే ఔట్ చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. పంజాబ్ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర(నాటౌట్)44 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 45 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింుకున్నాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ లో బొపార 6, గోయెల్ 12, యువరాజ్ సింగ్ 10, జయవర్దన 7, ఇర్ఫాన్ పఠాన్ 7, మోతా 5, చావ్లా 0, పొవార్ 10 పరుగులు చేశారు.
ముంబాయి బౌలర్లలో మలింగ 2, హీర్ ఖాన్, హర్భజన్ సింగ్, బ్రేవో, డుమిని, జయసూర్య ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. తరువాత బ్యాటింగ్ చేసిన ముబాయి జట్టులో ఓపెనర్ జయసూర్య డకౌట్ కాగా, టెండుల్కర్ 1, ధావన్ 3, డుమిని 59, బ్రేవో 15, నాయర్ 15, హర్భజన్ 6, తివారి(నటౌట్)6, జహీర్ ఖాన్(నాటౌట్)0 పరుగులు చేశారు. పంజాబ్ జట్టు బౌలర్లలో ఇర్ఫాన్ 2, అబ్దుల్లా 2, మాలిక్, పొవార్, చావ్లా ఒక్కొక్కటి వికెట్ పడగొట్టారు.
News Posted: 29 April, 2009
|