ఛార్జర్స్ కు డెవిల్స్ బ్రేక్!
సెంచూరియన్ పార్క్: ఐపిఎల్ రెండో సీజన్ లో డక్కన్ ఛార్జర్స్ విజయ పరంపరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బ్రేక్ వేసింది. గురువారం జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, బ్యాటింగుకు దిగిన ఛార్జర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ గిల్ క్రిస్ట్ 8 పరుగులకు పెవిలియన్ కు చేరుకోగా, హెర్షలీ గిబ్స్ డకౌట్ అయ్యాడు. వెస్టిండీస్ బ్యాట్స్ మన్ డానే స్మిత్ 28 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. బిలాఖియా 22, శర్మ 17, సుమన్ 23, వేణుగోపాలరావు 16, షోయబ్(రనౌట్)0, ఆర్పీ సింగ్(నాటౌట్) 2, ఓఝా(రనౌట్)1 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో నాన్స్ 2, నెహ్రా 2, సంగ్వాన్, మిశ్రా, వెట్టోరి ఒక్కొక్కటి వికె్లు పడగొట్టారు.
తరువాత బ్యాటింగుకు దిగిన ఢిల్లీ జట్టులో ఓపెనర్లు గంభీర్(17), సెహ్వాగ్ (20) మొదటి వికెట్ కు 30 పరుగులు జోడించారు. 11 బంతుల్లో నాలుగు బౌండరీలు కొట్టిన సెహ్వాగ్ తొలుత ఔటయ్యాడు. తరువాత డివిలియర్స్(5), గంభీర్ ఔటయ్యే సమ?ానికి ఢిల్లీ జట్టు స్కోరు 49 పరుగులే! ఆ తరువాత తిలకరత్నె దిల్షాన్(నాటౌట్ 52), దినేష్ కార్తిక్(41) జట్టును విజయపథం వైపు నడిపించారు. మనాస్(నాటౌట్) 3 పరుగులు చేశాడు. మొత్తం 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ జట్టు 150 పరుగులు సాధించి విజయాన్ని కైవసం చేసుకుంది. డక్కన్ బౌలర్లలో షోయబ్ 2, ఆర్పీ సింగ్, ఓఝా ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్న డర్క్ నాన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
News Posted: 30 April, 2009
|