రైనా సెంచరీ మిస్!
సెంచూరియన్: ఐపిఎల్ రెండో సీజన్ లో గురువారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌడర్ సురేష్ రైనా రెండు పరుగుల్లో సెంచరీ మిస్ అయ్యాడు. ఈ భారీ స్కోరు కారణంగా చెన్నై జట్టుకు 38 పరుగుల తేడాతో విజయం లభించింది. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రైనా ధాటీగా ఆడ్డంతో తొలుత బ్యాటింగు చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించగలిగింది. 55 బంతులెదుర్కొన్న రైనా 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. బద్రినాథ్(29,కెప్టెన్ ధోని(నాటౌట్ 22)మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేక పోయారు. ఓపెనర్లు పార్థివ్ పటేల్ 3, మాథ్యూ హేడెన్ 1, జాకబ్ ఓరమ్ 2 అల్బీ మోర్కెల్(నాటౌట్)4 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుసుఫ్ పఠాన్ 2, మునాఫ్ పటేల్ 2, షేన్ వార్న్ 1 వికెట్లు పడగొట్టారు.
తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాస్ట్ బౌలర్ కమ్రాన్ ఖాన్ చెన్నై జట్టు ఇన్నింగ్సులో బౌలింగు చేస్తూ గాయపడి, బ్యాటింగుకు రాలేకపోయాడు. రాయల్స్ జట్టులో క్వీనీ 28, గ్రీమ్ స్మిత్ 2, అస్నోద్కర్ 10, జడేజా 37, యూసుఫ్ పఠాన్ 20, మస్కరెనాస్ 8, వార్న్ 3, రావత్(నాటౌట్)8, మునాఫ్ పటేల్ 0, త్రివేది 2 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో లక్ష్మీపతి బాలాజీ 4, మోర్కెల్ 2, ఓరమ్ 2, సురేష్ రైనా 1 వికెట్లు పడగొట్టారు.
News Posted: 30 April, 2009
|