రైడర్స్ పై ఇండియన్స్ విజయం
ఈస్ట్ లండన్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జీన్ పాల్ డుమిని(నాటౌట్) 37 బంతుల్లో చేసిన అర్ధ సెంచరీ(52-1 ఫోర్, 4 సిక్సర్లు)తో ముంబై ఇండియన్స్ జట్టు కోల్కటా నైట్ రైడర్స్ ను 9 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ బ్రాడ్ హాడ్జ్(రనౌట్) 60 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో చేసిన 73 పరుగులు వృధా అయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించింది. జయసూర్య 6, టెండుల్కర్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34, హర్భజన్ సింగ్ 6, నాయర్ 10, నేపియర్ 15, రహానె 10, జహీర్ ఖాన్(నాటౌట్)2 పరుగులు చేశారు. కోల్కటా బౌలర్లలో ఇషాంత్ శర్మ, దిండా, కార్తిక్, అగార్కర్, గేల్, హాడ్జ్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
కోల్కటా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రం చేయగలిగింది. ఓపెనర్లు మరోసారి విఫలమయ్యారు. క్రిస్ గేల్ 7 పరుగులకే పెవిలియన్ చేరుకోగా, సౌరవ్ గంగూలీ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. వాన్ వి 32, శుక్లా 6, మెకల్లమ్ 5, సాహా(నాటౌట్) 8, అగార్కర్(నాటౌట్) 0 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో జహీర్ ఖాన్ 3, నేపియర్, అభిషేక్ ఒక్కొక్కటి వికెట్లు తీసుకున్నారు.
News Posted: 1 May, 2009
|