ఛార్జర్స్ పై రాయల్స్ గెలుపు
పోర్ట్ ఎలిజబెత్: టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఓటమివైపు వరుగులు పెడుతున్న డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్టును అభిషేక్ రౌత్, యూసుఫ్ పఠాన్ విజయపథంవైపు నడిపించారు. శనివారం హైదరాబాద్ డక్కన్ ఛార్జర్స్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించిన రాజస్థాన్ జట్టు ఐపిఎల్ రెండో సీజన్ లో మూడో వియం సాధించింది. డక్కన్ ఛార్జర్స్ కు ఇది వరుసగా రెండో ఓటమి. విజయం సాధించడానికి 142 పరుగులు చేయవలసిన రాయల్స్, ఇన్నింగ్సు ప్రారంభంలోనే 3 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ స్థితిలో మొదట కార్సెల్డిన్(39), ఆ తరువాత అభిషేక్ రౌత్(36 నాటౌట్), యీసుఫ్ పఠాన్(24) బాధ్యతాయుతంగా ఆడి జట్టును గట్టెక్కించారు. రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
రాజస్థాన్ ఓపెనర్లు గ్రీమ్ స్మిత్, అస్నోద్కర్(రనౌట్), టూ డౌన్ బ్యాట్స్ మన్ ఓఝా డకౌట్ అయ్యారు. జడేజా 12, వార్న్ 21, హార్ వుడ్(నాటౌట్)3 పరుగులు చేయగా, డక్కన్ బౌలర్లలో ఆర్పీ సింగ్ 2, వేణుగోపాల్ 2, ఎడ్వర్డ్స్, ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు డక్కన్ ఛార్జర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసింది. హెర్ష్ లీ గిబ్స్ 8, గిల్ క్రిస్ట్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39, బిలాకియా 1, రోహిత్ 38, సుమన్(నాటౌట్)41, డానే స్మిత్ 7, వేణుగోపాలరావు(నాటౌట్)0 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో హార్ వుడ్ 2, యూసుఫ్ పఠాన్, జడేజా, త్రివేది ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. పఠాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
News Posted: 3 May, 2009
|