వరల్డ్ ట్వంటీకి భారతజట్టు
ముంబై: ప్రస్తుం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐపిఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు అభిషేక్ నాయర్ కు ట్వంటీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారతజట్టులో స్థానం లభించలేదు. 15 మంది సభ్యులు గల భారతజట్టును బిసిసిఐ సోమవారం ఇక్కడ ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని ఈ జట్టులో ఈ యేడాది కూడా యువకులు, అనుభవజ్ఞు లు సమతూకంగా ఉండేలా బిసిసిఐ జాగ్రత్త పడింది. జట్టులో అందరికంటె సీనియర్లు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. సెహ్వాగ్ వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తాడు.
ఐపిఎల్ టోర్నీలో మంచి బౌలింగా ప్రతిభ కనబరుస్తున్న మునాఫ్ పటేల్ కు కూడా వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించలేదు. దీంతో ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓఝా ఎంపికకు మార్గం సుగమమయింది. రాబిన్ ఉతప్ప, ఎస్.శ్రీశాంత్ లను కూడా సెలక్షన్ కమిటీ పక్కన పెట్టేసింది.
భారతజట్టు: ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, రవీంద్ర జడేజా, ప్రగ్యాన్ ఓఝా, ఇర్ఫాన్ పఠాన్.
News Posted: 4 May, 2009
|