రాయల్స్ చేతిలో కింగ్స్ చిత్తు
డర్బాన్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రీమ్ స్మిత్, వికెట్ కీపర్ నామన్ ఓఝా తొలి వికెట్ భాగస్వామ్యానికి జోడించిన 135 పరుగులతో పాటు లక్ష్యం తప్పకుండా చేసిన బౌలింగ్ తో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఐపిఎల్ రెండో సీజన్ మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టును 78 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో ఈ యేడాది ఐపిఎల్ టోర్నమెంట్ లో అత్యధిక స్కోరును రాజస్థాన్ జట్టు నమోదు చేసి రికార్డు సృష్టించింది. పంజాబ్ కెప్టెన్ యువరాజ్ సింగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగు చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించగా, పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ట్వంటీ క్రికెట్ తొలిమ్యాచ్ ఆడిన నామన్ ఓఝా 68, స్మిత్ 77, యూసుఫ్ పఠాన్ 12, రవీంద్ర జడేజా 33, కార్సెల్ డైన్(నాటౌట్)16, ఎఎస్ రౌత్(నాటౌట్)1 పరుగులు చేయగా, పంజాబ్ బౌలర్లలో చావ్లా 2, పొవార్, ఇర్ఫాన్ పఠాన్ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. పంజాబ్ జట్టు ఇన్నింగ్సులో కెప్టెన్ యువరాజ్ సింగ్ ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడి రెండు పరుగుల తేడాలో అర్ధ సెంచరీ మిస్ అయ్యాడు. ఓపెనర్ సోహాల్ డకౌట్ కాగా, సంగక్కర 11, గోయెల్ 1, సైమన్ కటిచ్ 10, మహేల జయవర్దన 9, ఇర్ఫాన్ పఠాన్ 19, చావ్లా 6, పొవార్(నాటౌట్)6, శ్రీశాంత్(నాటౌట్)4 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో అమిత్ సింగ్ 4 ఓవర్లలో 9 పరుగులకు 3 వికెట్లు, షేన్ వార్న్ 2, హార్వుడ్, యూసుఫ్ పఠాన్, త్రివేది ఒక్కొక్కటి వికెట్లు తీసుకున్నారు.
News Posted: 5 May, 2009
|