ఢిల్లీని గెలిపించిన గంభీర్
డర్బాన్: భారతజట్టు ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐపిఎల్ మ్యాచ్ లో తొలిసారిగా బాగా రాణించి అర్ధ సెంచరీ(నాటౌట్ 71-57 బంతులు, 7 ఫోర్లు)తో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు విజయం సాధించిపెట్టాడు. మంగళవారం జరిగిన మ్యాచ్ లో గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు కోల్కటా నైట్ రైడర్స్ ను 9 వికెట్ల తేడాతో ఓడించి, ఈ టోర్నమెంట్ లో ఐదో విజయం సాధించి, పాయింట్ల(10) పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కటా జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించగా, ఢిల్లీ జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, 19 ఓవర్లలోనే 157 పరుగులతో విజయాన్ని కైవసం చేసుకుంది. రెండో ఓపెనర్ షేన్ వార్నర్ 36 పరుగులు చేసి అగార్కర్ బౌలింగ్ లో ఔట్ కాగా, తిలకరత్నె దిల్షాద్ (నాటౌట్)42 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కటా జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వాన్ విక్ 74, మెకల్లమ్ 35, బ్రాడ్ హాడ్జ్ 10, హెన్రిక్స్(నాటౌట్)30, సాహా(నాటౌట్)1 పరుగులు చేయగా, ఢిల్లీ బౌలర్లలో సంగ్వాన్ 2, ఆశిష్ నెహ్రా 1 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించాడు.
News Posted: 5 May, 2009
|