ముంబై పై రోహిత్ ఛార్జ్!
సెంచూరియన్: రోహిత్ శర్మ ఆల్ రౌండ్ ప్రతిభతో, ఐపిఎల్ రెండో సీజన్ లో, డక్కన్ ఛార్జర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ హ్యాట్రిక్ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డక్కన్ ఛార్జర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు సాధించగా, ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్లి కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛార్జర్స్ ఇన్నింగ్స్ లో గిల్ క్రిస్ట్ 25, గిబ్స్ 0, సుమన్ 20, రోహిత్ శర్మ 38(36 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్సర్), డానే స్మిత్ 16, వేణుగోపాలరావు(రనౌట్)28, రవితేజ(నాటౌట్)4, ర్యాన్ హారిస్(నాటౌట్)5 పరుగులు చేయగా, ముంబై బౌలర్లలో మలింగ, కులకర్ణి, డానే బ్రేవో, రోహన్ రాజె, జయసూర్య ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో డుమిని అర్ధ సెంచరీ(52-48 బంతులు, 7 ఫోర్లు) వృధా అయింది. ఓపెనర్లు జయసూర్య(5), టెండుల్కర్(2) విఫలమయ్యారు. పినాల్ షా 29, డానే బ్రేవో 13, నాయర్ 1, హర్భజన్ 0, తివారి 3, రాజె(నాటౌట్)11, కులకర్ణి(నాటౌట్)7 పరుగులు చేశారు. డక్కన్ బౌలర్లలో రోహిత్ శర్మ 4, ఆర్పీ సింగ్ 2, సుమన్ 2 వికెట్లు పడగొట్టారు.
News Posted: 7 May, 2009
|