ముంబై ఘన విజయం
సెంచురియన్: కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అద్భుత విజయంతో సెమీస్ అవకాశాలను కాపాడుకుంది. బౌలర్లు ఆధిపత్యం కనబరిచిన మ్యాచ్‌లో బ్రేవో (70), సచిన్ (41) పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. వీరిద్దరూ బ్యాట్ ఝుళిపించడంతో 120 పరుగుల లక్ష్యాన్ని ముంబయి మరో 22 బంతులు మిగిలివుం డగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సునాయాస లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ జయసూర్య(4) మరోసారి నిరాశ పరిచాడు. బ్రెట్‌లీ అద్భుత బంతితో అతన్ని పెవిలియన్ పంపాడు. రహానే(1) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
అయితే ఓపెనర్‌గా వచ్చిన బ్రేవో ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. కెప్టెన్ సచిన్‌తో కలిసి జట్టును విజయపథంలో నడిపించాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన బ్రేవో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే గతి తప్పిన బంతులను సిక్సర్లు, ఫోర్లకు తరలించాడు. 59 బంతులు ఎదుర్కొన్న బ్రేవో 7ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి కెప్టెన్ సచిన్ మంచి సహకారం అందించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ బ్యాట్స్‌మన్ 29 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌తో 41 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు పంజాబ్ 9వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సన్నీ సోహైల్ 43, గోయల్ 20(నాటౌట్) మాత్రమే రాణించారు. ముంబయి బౌలర్లలో హర్భజన్‌సింగ్, డుమీని రాణించారు.
News Posted: 12 May, 2009
|