చేజేతులా డక్కన్ ఓటమి
డర్బన్: గిల్లీ విధ్వంసం.. సైమో వీరవిహారం.. ఢిల్లీకి ఓటమి సంకటం... ఎదురే లేని దక్కన్ స్కోరు 150/4. చేతిలో అరడజను వికెట్లు.. చేయాల్సింది 24 పరుగులే. గిల్లీ సేన ఓటమి ఊహకందదు. కానీ భాటియా బంతికి మాత్రం ఆ ఓటమి అందింది. గెలిచే అదే స్కోరుపై సైమో (41) బౌల్డ్... రెండు బంతుల వ్యవధిలో స్మిత్(1) బౌల్డ్... తర్వాత ప్రజ్ఞాన్ ఓజా(0) బౌల్డ్.... ఛార్జర్స్ క్లీన్‌బౌల్డ్ 161/10. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 173/7 స్కోరు చేసింది. దినేశ్ కార్తీక్(44 నాటౌట్), డివిలియర్స్(44) మెరుపులు మెరిపించాడు. అంతకుముందు వన్‌డౌన్‌లో వచ్చిన దిల్షాన్ కూడా 37(18బంతుల్లో) పరుగులు చేసి వెనుదిరిగాడు. కష్ట సాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన దక్కన్ ఛార్జర్స్ గెలుపు వాకిట 19.4 ఓవర్లలో 161 పరుగులు చేసి బోల్తా కొట్టింది. గిల్‌క్రిస్ట్(64) శ్రమ, సైమండ్స్(41) పోరాటం బూడిదలో పోసిన పన్నీరైంది.
దక్కన్ విజయలక్ష్యం 174. ఓవర్‌కు తొమ్మిదేసి బాదాల్సిందే. అలాగే ఇన్నింగ్స్ కూడా ఎదురుదాడితోనే ప్రారంభించింది దక్కన్. తొలి ఓవర్లోనే గిల్లీ ప్రతాపానికి 18 పరుగులు రాలాయి. రెండో ఓవర్లో మరో 12. మొత్తం 2 ఓవర్లలో 30 పరుగులు. తర్వాత సుమన్(3)కు సంగ్వాన్ బౌలింగ్‌లో చుక్కెదురైంది. కాసేపటికే రవితేజ(6)కూడా సంగ్వాన్ బౌలింగ్‌లోనే ఔట్. కానీ గిల్లీ జోరు మాత్రం పట్టపగ్గాలు లేకుండా సాగింది. గిల్లీ 24 బంతుల్లో (5్ఠ4, 3్ఠ6) ఫిఫ్టీ పూర్తి చేశాడు. 10 ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా 83/2. 11ఓవర్లో గిల్లీ(64) ఇన్నింగ్స్‌ను సంగ్వానే బౌల్డ్ చేశాడు. కానీ సైమండ్స్, రవితేజలు దక్కన్‌ను విజయశిఖరాలకు చేర్చారు. 17వ ఓవర్ ముగిసే సరికి 149/4తో గెలిచే స్థితిలో ఉన్న ఛార్జర్స్‌ను 18వ ఓవర్ వేసిన భాటియా అధోగతి పాలు చేశాడు. సైమండ్స్(41), స్మిత్(1) బౌల్డ్ చేశాడు. తిరిగి ఇన్నింగ్స్ 20 ఓవర్లో ఓజా(0) బౌల్డ్ చేశాడు. షోయబ్(0) క్యాచ్ ఔట్ చేశాడు. ఢిల్లీని అనూహ్యంగా గెలిపించాడు. తాను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.
టాస్ గెలిచిన దక్కన్ ఛార్జర్స్ ముందు ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది. దీంతో గంభీర్, వార్నర్ ఢిల్లీ డెవిల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ రెండో ఓవర్లోనే వార్నర్(4) విఫలమయ్యాడు. చమిందా వాస్ తన తొలిఓవర్లోనే వార్నర్‌కు పెవిలియన్ దారి చూపాడు. తర్వాత దిల్షాన్, గంభీర్‌కు జతయ్యాడు. గంభీర్ గాడిన పడేందుకు అపసోపాలు పడుతుంటే, దిల్షాన్ మాత్రం యథేచ్చగా బ్యాట్‌ను ఝలిపించాడు. మైదా నం నలుమూలలా బౌండరీలు బాదాడు. ఇద్దరూ జట్టు స్కోరును 50కి చేర్చాడు. జట్టు స్కోరు 57 పరుగుల వద్ద దిల్షాన్ జోరుకు సైమండ్స్ కళ్లెం వేశాడు. 18 బంతుల్లో (7్ఠ4, 1్ఠ6) 37 పరుగులు చేసి నిష్ర్కమించాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్ కూడా వేగంగా స్కోరు జతచేశాడు. కానీ అవతలి వైపు గంభీరే మెరిపించలేకపోయాడు.
చివరకు గంభీర్(19)ను వేణుగోపాల్‌రావు క్యాచ్‌తో ప్రజ్ఞా న్ ఓజా పెవిలియన్ పంపాడు. గంభీర్ నిష్ర్కమణతో సెహ్వాగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. సెహ్వాగ్, డివిలియర్స్‌లు జట్టు స్కోరును 14వ ఓవర్లో వందకు చేర్చారు. కానీ కాసేపటికే సెహ్వాగ్(11)ను వాస్ ఔట్ చేశాడు. 103 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్‌ను చేజార్చుకుంది. సెహ్వాగ్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దినేశ్ కార్తీక్ తొలుత నెమ్మదిగానే ఆడాడు. ఈ దశలో 44(4్ఠ4,1్ఠ6) పరుగులు చేసిన డివిలియర్స్‌ను ద్వానే స్మిత్ ఔట్‌చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ రెచ్చిపోయా డు. సిక్సు, ఫోర్లతో 18 పరుగులు బాదాడు. ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు లభించాయి. ఢిల్లీ 20 ఓవర్లలో 173/7 స్కోరు చేసింది.
News Posted: 13 May, 2009
|