ఐపిఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్!
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండవ సీజన్ టోర్నీలో భాగంగా కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబి) మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ 'ఫిక్స్' అయిందీ లేనిదీ తేల్చుకోవడానికి తాను మ్యాచ్ వీడియో ఫుటేజ్ చూడగలనని ఐపిఎల్ చైర్మన్, కమిషనర్ లలిత్ మోడి ప్రకటించారు.
ఈ సీజన్ లో తమ జట్టు తరఫున అత్యధికంగా పరుగులు స్కోర్ చేసిన ఆస్ట్రేలియన్ బ్రాడ్ హాడ్జిని నైట్ రైడర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ జట్టుతో పోటీకి ఎంపిక చేయలేదు. అయితే, డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొనడానికి బదులు హాడ్జి మ్యాచ్ సమయంలో హాస్పిటాలిటీ బాక్స్ లో కనిపించాడు. 'అవినీతి నిరోధక విభాగం ఒకటి ఉంది. మేము టివి ఫుటేజిని చూసి హాస్పిటాలిటీ విభాగంలో హాడ్జి కనిపించడంపై దర్యాప్తు జరుపుతాం' అని లలిత్ మోడి చెప్పినట్లు 'ఇండియా టుడే' వెబ్ సైట్ తెలియజేసింది.
173 పరుగులతో చెప్పుకోదగిన స్కోరు చేసినప్పటికీ నైట్ రైడర్స్ జట్టు ఈ పోటీలో ఓడిపోయింది.
వాస్తవానికి ఐపిఎల్ లో మ్యాచ్ లను ఫిక్స్ చేయవచ్చునని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐపిఎల్) భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐసిసి అవినీతి నిరోధక విభాగం సేవలను వినియోగించుకోవడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఆదిలో నిరాకరించింది. ఆ విభాగం ఫీజులు మరీ ఎక్కువగా ఉన్నాయని బిసిసిఐ పేర్కొన్నది.
News Posted: 14 May, 2009
|