ఇక గంగూలీ కామెంట్రీ!
న్యూఢిల్లీ : కోల్ కతా దాదా సౌరవ్ గంగూలీ తన కెరీర్ లో మరో కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. ఈసారి క్రికెటర్ గా కాకుండా వ్యాఖ్యాతగా. ఇందుకు సంబంధించి సౌరవ్ ఇ.ఎస్.పి.ఎన్ - స్టార్ స్పోర్ట్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ లో శుక్రవారం నుంచి మొదలవుతున్న ప్రపంచ ట్వంటీ 20 టోర్నమెంట్ పై విశ్లేషణలు అందించే నిపుణుడిగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఇ.ఎస్.పి.ఎన్ తరఫున ఇయాన్ చాపెల్, అక్రమ్, మంజ్రేకర్, బిషప్, హర్ష్ బొగ్లే, నాసర్ హుస్సేన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కొత్త పాత్రను అతడు టోర్నమెంట్ సెమీస్ నుంచి మొదలుపెడతాడట. ఇందులో భాగంగా అతడు తన సహచరులతో కొన్ని ఇంటర్వ్యూలు తీసుకోనున్నాడు. కామెంటరీ బాక్సులో అతడి సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా ఇ.ఎస్.పి.ఎన్ ఎండీ వ్యాఖ్యానించారు.
News Posted: 4 June, 2009
|