సిడ్నీ : మద్యం సేవించి మత్తులో జోగాడన్న ఆరోపణపై ఆండ్రూ సైమండ్స్ పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది. ట్వంటీ - 20 టీమ్ నుంచి ఆస్ట్రేలియా తొలగించింది. మ్యాచ్ సందర్భంగా సైమండ్స్ మద్యం సేవించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ చర్య తీసుకుంది. గురువారం ఒక ప్రకటన విడుదల చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయం వెల్లడించింది.