బౌలింగ్ పై ధోనీ డౌట్
లండన్ : పాకిస్థాన్ పై గత రాత్రి సాధించిన అద్భుత విజయంతో మరింత నైతిక స్పూర్తి అందుకున్న మహేంద్రసింగ్ ధోనీ తమ బౌలింగ్ విభాగం ఆశించినంత పటిష్టంగా లేదన్నాడు. ఏమైనా భారత్ ఓవరాల్ ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేసిన ధోని పాక్ పై 9 వికెట్ల విజయాన్ని అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ న్యూజిలాండ్ తో ఓటమి తర్వాత ఎంతో కీలకమైనదిగా భావించాం. కాని ఈ మ్యాచ్ లో కొన్ని ఓవర్ల బౌలింగ్ సరిగా లేదని, ఈ లోపాన్ని సమవరించోవాల్సిందని ధోని అన్నాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జోరు చూస్తే 180 పరుగులు చేయగలరని అనుకున్నానని, అయితే ట్వంటీ 20లో కొన్ని వికెట్లు కూలితే పరుగులు చేయడం సాధ్యపడదనే విషయం తమకు తెల్సిందేనన్నాడు.
News Posted: 5 June, 2009
|