భారత్ పోటీకి వర్షం ముప్పు
నాటింగ్ హామ్ (ఇంగ్లండ్) : ప్రపంచ కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్ లో భారత, బంగ్లాదేశ్ జట్ల మధ్య నాటింగ్ హామ్ ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో శనివారం జరగవలసిన పోటీకి వర్షం ప్రతిబంధకం కానున్నది. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన వర్షం తెల్లవార్లూ కురుస్తూనే ఉంది. శనివారం కూడా వర్షం పడవచ్చునని వాతావరణ కేంద్రం సూచించింది.
వర్తమాన చాంపియన్ భారత జట్టు ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ను శనివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు) బంగ్లాదేశ్ తో ఆడవలసి ఉంది. కాని వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు మృగ్యం కావచ్చు. భారత జట్టు తన రెండవ పోటీని ఈ నెల 10న ఐర్లాండ్ జట్టుతో ఆడుతుంది.
News Posted: 6 June, 2009
|