గేల్ దుమారం
ఓవల్: ట్వంటీ-20 ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ గేల్ (88) వీరవిహారం చేయడంతో 170 పరుగుల లక్ష్యాన్ని విండీస్ మరో 25 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ప్రారంభం నుంచే అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు గేల్, ఫ్లెచర్ భారీ షాట్లతో ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తించారు. ఇద్దరు పోటీపడి పరుగుల వర్షం కురిపించడంతో స్కోరుబోర్డు పరిగెత్తింది. గేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను కంగారెత్తించాడు. ధాటిగా ఆడిన గేల్ 50 బంతుల్లోనే 6ఫోర్లు, 6సిక్స్‌లతో 88 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఫ్లెచర్(53)తో కలిసి తొలి వికెట్‌కు 133 పరుగులు జోడించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 7వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. వార్నర్ (63), డేవిడ్ హస్సీ (27), మైక్ హస్సీ (28) పరుగులతో జట్టును ఆదుకున్నారు.
ఆస్ట్రేలియా: వాట్సన్ (సి) శర్వాణ్ (బి) టేలర్ 0, వార్నర్ (సి) బెన్ (బి) బ్రేవో 63, పాంటింగ్ ఎల్‌బిడబ్ల్యు (బి) టేలర్ 0, క్లార్క్ (సి) బెన్ (బి) ఎడ్వర్డ్స్ 2, హడిన్ (సి) బెన్ (బి) పొలార్డ్ 24, మైక్ హస్సీ (సి) ఫ్లెచర్ (బి) బ్రేవో 27, మైక్ హస్సీ నాటౌట్ 28, జాన్సన్ (సి) బ్రేవో (బి) ఎడ్వర్డ్స్9, బ్రెట్‌లీ నాటౌట్1, ఎక్స్‌ట్రాలు15, మొత్తం20 ఓవర్లలో 7వికెట్లకు 169
వికెట్ల పతనం: 1-1, 2-3, 3-15, 4-81, 5-113, 6-143, 7-153
బౌలింగ్: టేలర్ 4-0-33-2, ఎడ్వర్డ్స్ 4-0-34-2, బ్రేవో 4-0-31-2, బెన్ 4-0-35-0, గేల్ 2-0-13-0, పొలార్డ్ 2-0-17-1
వెస్టిండీస్: గేల్ (సి) వాట్సన్ (బి) బ్రెట్‌లీ 88, ఫ్లెచర్ (సి) డేవిడ్ హస్సీ (బి) జాన్సన్ 53, మార్షల్ (సి) హోప్స్ (బి) జాన్సన్ 8, చందర్‌పాల్ నాటౌట్ 0, శర్వాణ్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం 15.5 ఓవర్లలో 3వికెట్లకు 172
వికెట్ల పతనం: 1-133, 2-157, 3-162
బౌలింగ్: బ్రెట్‌లీ 4-0-56-1, జాన్సన్ 3.5-0-36-2, బ్రాకెన్ 2-0-21-0, జేమ్స్‌హోప్స్ 2-0-13-0, డేవిడ్ హస్సీ 1-0-16-0, వాట్సన్ 2-0-13-0, క్లార్క్
1-0-12-0.
News Posted: 7 June, 2009
|