ఆసీస్‌కు లంక షాక్
నాటింగ్‌హామ్: ఆస్ట్రేలియా ఔట్. లీగ్ దశలోనే నిష్ర్కమణ. రికీ పాంటింగ్ నేతృత్వంలో ఆసీస్ ఇలా ప్రపంచకప్ లీగ్ దశలో నిష్ర్కమించడం ఇదే తొలిసారి. తొలుత మెండీస్, మలింగ బంతితో రఫాడిస్తే... దిల్షాన్, సంగక్కర బ్యాట్‌తో ఆసీస్ కథ కంచికి చేర్చారు. ఆసీస్ తమ ముందుంచిన 160 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంగక్కర (55 నాటౌట్), ముబారక్(21 నాటౌట్) లంకను విజయధరికి చేర్చారు.
తొలుత దిల్షాన్ 53 పరుగులు చేసి లంక విజయానికి నాంది పలికాడు. అంతకుముందు మెండీస్ మాయలో ఆస్ట్రేలియా విలవిలలాడింది. ముందు బ్యాటింగ్ చేసి తడబడింది. అయితే చివర్లో జాన్సన్, డేవిడ్ హస్సీ, బ్రెట్‌లీ మెరుపులు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు ఊపిరిపోశాయి. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసినా జాన్సన్(28 నాటౌట్, 2్ఠ4, 2్ఠ6) మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముందు 160 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. యువ స్పిన్నర్ అజంత మెండీస్, పేసర్ మలింగ చెరి 3 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలం కెప్టెన్ సంగక్కర తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హార్డ్ హిట్టర్ వార్నర్(0)ను డకౌట్ చేయడం ద్వారా మ్యాథ్యూస్, కంగారూ పతనాన్ని ప్రారంభించాడు. తర్వాత కెప్టెన్ పాంటింగ్, ఓపెనర్ వాట్సన్‌కు జతయ్యాడు. జట్టు స్కోరును 50 పరుగుల సమీపానికి తీసుకెళ్లే లోపే మెండీస్, రి‘కీ’ దెబ్బకొట్టాడు. పాంటింగ్(25)ను బౌల్డ్ చేసిన మెండీస్, తన తదుపరి ఓవర్లో వాట్సన్(22) పెవిలియన్ చేర్చాడు. తర్వాత హడిన్(16), మైఖేల్ క్లార్క్(11)లు క్రీజ్ లోకి వచ్చినా పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. హడిన్‌ను మలింగ, క్లార్క్ ను ఉదన ఔట్ చేశారు. అలా అపసోపాలు పడుతూ ఆసీస్ వందస్కోరుకు సమీపిం చింది.
చివర్లో డేవిడ్ హస్సీ (28) అండతో జాన్సన్ చెలరేగాడు. 13 బంతు ల్లోనే జాన్సన్ 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత హస్సీ నిష్ర్కమిస్తే క్రీజ్ లోకి వచ్చిన బ్రెట్‌లీ కూడా 5 బంతుల్లో 15(2్ఠ4, 1్ఠ6) పరుగులు చేశాడు. చివరి ఓవర్లో మలింగ, బ్రెట్‌లీని, హారిట్జ్‌ను పెవిలియన్ పంపగా ఆసీస్ 159/9 స్కోరు చేసింది.
స్కోరు:
ఆస్ట్రేలియా: నిర్ణీత 20 ఓవర్లలో 159/9. (జాన్సన్ 28 నాటౌట్, డేవిడ్ హస్సీ 28, పాంటింగ్ 25; మెండీస్ 3/20, మలింగ 3/36, ఉదన 2/47)
శ్రీలంక: 19 ఓవర్లలో 160/4 (సంగక్కర 55 నాటౌట్, దిల్షాన్ 53, ముబారక్ 21 నాటౌట్; బ్రెట్‌లీ 2/39, హారిట్జ్ 1/27, మైఖేల్ క్లార్క్ 1/19)
News Posted: 8 June, 2009
|