బంగ్లాదేశ్ ఔట్
నాటింగ్‌హమ్: ఒబ్రియన్ బ్రదర్స్ బంగ్లాదేశ్ భరతం పట్టారు. గ్రూప్ ఏలో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. గ్రూప్ నుంచి భారత్‌తో పాటు బంగ్లాకు షాకిచ్చిన ఐర్లాండ్ సూపర్-8 దశకు చేరుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 137/8 పరుగులు చేసింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మరో 10 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. నియాన్ ఒబ్రియన్ 40 (25 బంతులు: 3ఫోర్లు, 3 సిక్స్‌లు), కెవిన్ ఒబ్రియన్ 39 నాటౌట్ (17 బంతులు: 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)లతో జట్టును గెలిచించారు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ నియాల్ ఒబ్రియన్‌కు దక్కింది.
అంతకు ముందు ఐర్లాండ్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐరీష్ బౌలర్ జాన్‌స్టర్ (3/20) ఇన్‌స్వింగర్లకు బంగ్లా టాప్‌ఆర్డర్ పెవిలియన్‌కు క్యూకట్టారు. సిద్ధిఖీ (13), ఆష్రాఫుల్ (14), సకిబ్ (7)లు వరుసగా జాన్‌స్టర్ బౌలింగ్‌లో నిష్ర్కమించారు. మిడిల్ ఓవర్లలో వెస్ట్, మెక్‌కలన్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో బంగ్లాకు పరుగులు రావడం గగనమైయింది. అయితే చివరి ఓవర్‌లో మోర్తుజా (33 నాటౌట్: 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) విజృంభించి 20 పరుగులు చేయడంతో జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్: ఇక్బాల్ (రనౌట్) 22, సిద్ధిఖీ (సి)బ్రే (బి)జాన్‌స్టర్13, ఆష్రాఫుల్ (సి) ే ఒబ్రియన్ (బి) జాన్‌స్టర్ 14, సకిబ్ (సి)విల్సన్ (బి) జాన్‌స్టర్ 7, మహ్ముదుల్లా (స్టంప్) ఎన్‌జే ఒబ్రియన్ (బి) కసక్ 7, హసన్ (బి) మెక్‌కలన్ 13, రహీం (సి) మూనె (బి)రిగాన్ వెస్ట్ 14, మోర్తుజా(నాటౌట్)33, నయూం ఇస్లాం (బి) రంకీన్ 7, రజాక్ (నాటౌట్)0, ఎక్స్‌ట్రాస్ 7, మొత్తం (20 ఓవర్లలలో) 137/8. బౌలింగ్: రంకీన్ 4-0-36-1, జాన్‌స్టర్ 4-0-20-3, వెస్ట్ 4-0-25-1, మెక్‌కలన్ 4-0-17-1, కసక్ 4-0-38-1
ఐర్లాండ్: బ్రే (సి) రఖిబుల్ (బి) మోర్తుజా 2, పోర్టర్‌ఫీల్డ్ (సి అండ్ బి) రజాక్ 23, నియాల్ ఒబ్రియన్ (సి) రుబెల్ హుస్సేన్ (బి) సకిబ్ 40, విల్‌స్టన్ (సి) ఆషఫ్రుల్ (బి) మోర్తుజా 10, మూనె (నాటౌట్) 17, కెవిన్ ఒబ్రియన్ (నాటౌట్) 39, ఎక్స్‌ట్రాస్ 7, మొత్తం (18.2 ఓవర్లలో) 138/4
బౌలింగ్ : మోర్తుజా 4-0-30-2, రుబెల్ 3.2-0-31-0, మహ్మదుల్లా 3-0-23-0, నయూం 2-0-9-0, సకిబ్ 3-0-23-1, రజాక్ 3-0-18-1
News Posted: 8 June, 2009
|