నాటింగ్‌హామ్: ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గంభీర్ (37)తో కలిసి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించి శుభారంభం అందించాడు. ఓపెనర్లు రాణించడంతో భారత్ సునాయాసంగా విజ యాన్ని అందుకుంది. బౌ లింగ్‌లో రాణించిన జహీర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.