బోర్లపడ్డ భారత్
లండన్: సూపర్-8లో భారత్‌కు విండీస్ షాకిచ్చింది. బ్రేవో ఆల్‌రౌండ్ ప్రతిభ భారత్‌ను ఓడించింది. భారత ‘టాప్’ జోరుకు ఎడ్వర్డ్‌స (3/24)తో కలిసి కళ్లెం వేసిన బ్రేవో(4/38), తర్వాత బ్యాటింగ్‌లో అజేయమైన ఫిఫ్టీతో రాణించాడు. తొలుత 29కే 3 వికెట్లు కోల్పోయి ‘టాప్’ లేచిన భారత్‌కు మళ్లీ యువరాజే పెద్ద దిక్కయ్యాడు. తప్పటడుగుల బ్యాటింగ్ ఆర్డర్‌కు మరమ్మత్తు చేశాడు. దీనికి యూసుఫ్ పఠాన్ తనవంతు సహకారం అందించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 153/7 స్కోరు చేసింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.4 ఓవర్లలో 156/3 స్కోరు చేసి అధిగమించింది. గేల్(22) నిష్ర్కమించినా...బ్రేవో(66 నాటౌట్), సిమండ్స్(44) విండీస్‌ను గెలిపించారు.
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. విండీస్ వికెట్ల వేటలో పడింది. ఫలితంగా రెండో ఓవర్ రెండో బంతికే రోహిత్ ఔట్. ఎడ్వర్డ్‌స వేసిన ఆ ఓవర్ తొలిబంతికి బౌండరీ బాదిన రోహిత్ అదే జోరుతో భారీ షాట్‌కు ప్రయత్నిస్తే అది గాల్లో లేచింది. సిమం డ్స్ ఓడిసి పట్టుకోవడంతో రోహిత్(5) నిష్ర్కమించాడు. తర్వాత రైనా(5) వచ్చినా... ఎడ్వర్డ్‌స మరుసటి ఓవర్లోనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 27కే ఇరు బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన భారత్‌కు 2 పరుగుల వ్యవధిలో మరోషాక్. బ్రేవో బౌలింగ్‌లో బ్యాట్ ఝలిపించిన గంభీర్ షాట్‌కు సిమండ్స్ అద్భుత క్యాచ్ పెవిలియన్‌కు దారి చూపింది. ఇక ధోనీ, యువరాజ్‌ల ఆట మొదలైంది. 9వ ఓవర్లో 50 పరుగులు చేసిన భారత్ కాసేపటికే ధోనీ(11) వికెట్‌ను కోల్పోయింది.
ఈ దశలో వచ్చిన యూసుఫ్ పఠాన్ అండతో యువరాజ్ పరుగుల వేగం పెంచాడు. 37బంతుల్లో(4్ఠ4, 1్ఠ6) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. యూసుఫ్ కూడా (31)వేగంగానే పరుగులు జతచేశాడు. యువజోరు (67)కు మళ్లీ ఎడ్వర్డ్‌స బ్రేకేశాడు. అనంతరం వచ్చిన ఇర్ఫాన్(2)తో పాటు, యూసుఫ్ పఠాన్‌ను బ్రేవో పెవిలియన్ చేర్చాడు. భారత్ చివరకు హర్భజన్ (4 బంతుల్లో 3్ఠ4,13) మెరుపులతో 150 దాటింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లార్డ్‌స స్టేడియంలో ప్రేక్షకుడయ్యాడు. మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రవిశాస్ర్తీతో కలిసి మ్యాచ్ తిలకించాడు. అంతకుముందు సచిన్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భార్య అంజలి, కుమారుడు అర్జున్‌తో కలిసి లండన్ వచ్చాడు. ఛాయచిత్ర పుస్తకం కోసం ఫోటోలకు ఫోజిచ్చాడు. 800 పేజీలతో రూపుదిద్దుకుం టున్న ఈ భారీ పుస్తకంలో వెయ్యి ఫోటోలుంటాయి. సచిన్‌కు సంబంధించిన మునుపెన్నడూ చూడని ఫోటోలతో ఈ ఫోటోపుస్తకం రూపుదిద్దుకుంది.
స్కోరుబోర్డు:
భారత్: గంభీర్ (సి)సిమండ్స్ (బి)బ్రేవో 14, రోహిత్‌శర్మ (సి)సిమండ్స్ (బి)ఎడ్వర్డ్‌స 5, రైనా (సి)రామ్‌దిన్ (బి)ఎడ్వర్డ్‌స 5, యువరాజ్ సింగ్ (సి అండ్ బి)ఎడ్వర్డ్‌స 67, ధోనీ (సి)ఫ్లెచర్ (బి)బ్రేవో 11, యూసుఫ్ పఠాన్ (బి)బ్రేవో 31, ఇర్ఫాన్ పఠాన్ (సి)సిమండ్స్ (బి)బ్రేవో 2, హర్భజన్ నాటౌట్ 13, జహీర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో) 153/7
వికెట్ల పతనం: 1-12, 2-27, 3-29, 4-66, 5-130, 6-140, 7-141
బౌలింగ్: టేలర్ 4-0-44-0, ఎడ్వర్డ్‌స 4-0-24-3, ద్వానే బ్రేవో 4-0-38-4, క్రిస్ గేల్ 3-0- 13-0, పొలార్డ్ 2-0-7-0, బెన్ 3-0-26-0
విండీస్: 18.4 ఓవర్లలో 156/3 (బ్రేవో 66 నాటౌట్, సిమండ్స్ 44; ఇర్ఫాన్ 1/9)
News Posted: 13 June, 2009
|