టి-20 నుంచి భారత్ ఔట్
లండన్: టి-20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్ ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నమెం ట్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ధోనీ సేన బోల్తా పడింది. వి జయం కోసం 154 పరుగులు చేయాల్సిన భారత్ 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేశారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆర్పీ సింగ్ ప్రారంభంలోనే ఓపెనర్ లుక్‌రైట్(1)నుే పెవిలియన్ పంపించి పైచేయి అందించాడు. ఆర్పీ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టాడు.
అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పీటర్సన్‌తో కలిసి రవిబొపార ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరిద్దరూ సమన్వయంత ఆడుతూ స్కోరును ముందుకు నడపించాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ను పటిష్ట పరిచారు. వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ భారత బౌలర్లను అస హనానికి గురి చేశారు. దీనికి భారత పేలవ ఫీల్డింగ్ జతకావడంతో పరుగులు సు లువుగా లభించాయి. వీరిద్దరూ రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. ధాటిగా ఆడిన రవిబొపార 3ఫోర్లు, సిక్స్‌తో 37 పరుగులు చేశాడు.
ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. అ ద్భుత బంతితో బొపారను పెవిలియన్ పంపించిన జడేజా కొద్ది సేపటికే పీటర్సన్‌ను ఔట్ చేశాడు. 27 బంతుల్లోనే 5 ఫోర్లు, సిక్స్‌తో 46 పరుగులు చేసిన పీటర్సన్‌ను జడేజా బలిగొన్నాడు. యువ ఆటగాడు ఓవెజ్‌షా(12)ను హర్భజన్ పెవిలియన్ పంపాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన ఆర్పీ మూడు ఓవర్ల లో 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హర్భజన్‌కు మూడు, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్: 20 ఓవర్లలో 153/7( పీటర్సన్ 46, రవిబొపార 37, మస్కరెన్హస్ 25 నాటౌట్, హర్భజన్ 3/30, జడేజా 2/26.
భారత్: 20 ఓవర్లలో 5వికెట్లకు 150/5(యూసుఫ్ 33, ధోనీ 30).
News Posted: 15 June, 2009
|