సెమీఫైనల్స్ లో పాకిస్తాన్
లండన్: ట్వంటీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్థాన్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్-ఎఫ్ నుంచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. యువ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ అద్భుత బౌలింగ్‌తో జట్టును సెమీస్‌కు చేర్చాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చిన అజ్మల్ 4వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులతో విజయం వైపు దూసుకెళ్లిన ఐర్లాండ్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
అజ్మల్ కీలక సమయంలో వికెట్లు తీసి పాక్‌ను గెలిపించాడు. ఐర్లాండ్ జట్టులో పోర్టర్‌ఫీల్డ్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. మిగతావారిలో కెవిన్ ఓబ్రియాన్ 26, స్టిర్లింగ్ 17 పరుగులు మాత్రమే రాణించారు. పాక్ బౌలర్లలో అజ్మల్ నాలుగు, ఉమర్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కమ్రాన్ అక్మల్ అద్భుత అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన అక్మల్ 5ఫోర్లు, సిక్స్‌తో 57 పరుగులు చేశాడు. షాజిబ్ 23, ఆఫ్రిది 24, మిస్బా 20 పరుగులు సాధించారు.
News Posted: 15 June, 2009
|