చెత్తగా ఆడారు : అజర్
హైదరాబాద్: టి-20 వరల్డ్‌కప్ నుంచి భారత జట్టు వైదొలగడానికి చెత్త ఆటే కారణమని భారత క్రికెట్ మాజీ కెప్టెన్, లోక్‌సభ సభ్యుడు మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. ట్రోఫీని నిలబెట్టుకునే సత్తా జట్టుకు ఉన్నా పేలవమైన ఆటతో సూపర్-8లో వెనుదిరగడం బాధగా ఉందన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న జట్టు అర్ధంతరంగా నిష్ర్కమించడం అభిమానులను నిరాశపరిచిందన్నారు. సమష్టి వైఫల్యం వల్లే ధోనీ సేన పరాజయం పాలైందన్నారు. వరుస విజయాలతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురింప చేసిన టీమిండియా కనీసం సెమీస్‌కు కూడా చేరకపోవడం బాధించే విషయమాన్నారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచుల్లో భారత ఫీల్డింగ్ ఘోరంగా ఉందన్నారు. ఇప్పటికైనా క్రికెట్ బోర్డు జట్టు వైఫల్యాలపై దృష్టి సారించాలని అజర్ సూచించారు.
News Posted: 15 June, 2009
|